కేసీఆర్ చేసింది దొంగ దీక్ష.....





కేసీఆర్ చేసింది దొంగ దీక్ష.....

దొంగచాటుగా ఫ్లూయిడ్లు, ఇంజక్షన్లు, న్యూట్రియెంట్లు తీసుకున్నారూ.

పాత సినిమాలో పద్మనాభం “కాశీకి పోయాను రామ హరే గంగ తీర్థంబు తెచ్చాను రామా హరే” అనగానే ఆయన భార్య గిరిజ “కాశీకి పోలేదు రామా హరే ఊరి కాల్వలో నీళ్లండి రామ హరే” అంటూ గాలి తీసేస్తుంది. అలాగే చావు కోరల్లోకి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేసాను, అంతలా ఆమరణ దీక్ష చేశాను, డాక్టర్లు చచ్చిపోతావు అన్నారు నన్ను అంటూ కేసీఆర్‌ చెబుతుంటే అదంతా వట్టి గ్యాస్ అని నిమ్స్ మెడికల్ రిపోర్టులు బయటికి రావడంతో కేసీఆర్ గుట్టు రట్టైఅంది.




ప్రత్యేక తెలంగాణ కోసం 2009లో కేసీఆర్ చేసింది ఆమరణ దీక్ష కాదని, దొంగ దీక్ష అని రిపోర్టుల సాక్షిగా బయటపడింది . అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. నిమ్స్‌లోవున్న కేసీఆర్.. దొంగచాటుగా ఫ్లూయిడ్లు, ఇంజక్షన్లు, న్యూట్రియెంట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ తరహా దీక్ష చేస్తే పదేళ్లయినా కేసీఆర్‌కు ఎలాంటి ఇబ్బందివుండదని నిమ్స్‌ ఆసుపత్రి రికార్డులే చెబుతున్నాయని గుర్తుచేశారు. నిమ్స్‌లోవున్న రోజులు గడ్డం పెంచడం తప్ప, కేసీఆర్‌ నిరాహార దీక్ష చేయ లేదన్నారు. మణిపూర్‌లో షర్మిల 12 ఏళ్లపాటు ఇలాగే ఇంజక్షన్లు, ఫ్లూయిడ్లు తీసుకుంటూనే దీక్ష చేసి బతికారనే విషయాన్ని గుర్తు చేశారు.



No comments

Powered by Blogger.