బాబ్లీ ప్రాజెక్ట్ పై ఢిల్లీని ఢీకొన్నది వైఎస్సే

 బాబ్లీ ప్రాజెక్ట్ పై ఢిల్లీని ఢీకొన్నది వైఎస్సే





తెలంగాణ, కోస్తా జిల్లాల జలాధారాలకు, ప్రాజెక్టులకు గండి కొట్టే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం తల పెట్టడానికి నిరసనగా ఆనాటి టీడీపీ సహా కొన్ని ప్రతిపక్షాలు ఆందోళన తలపెట్టడంలో తప్పులేదు. కాని, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రాజె క్టులకు, ప్రజాహిత పథకాలకు అంకురార్పణ చేసి, వాటిని విజయవం తంగా అమలు చేసిన రాజశేఖరరెడ్డి పై కొందరు అభాండాలు వేయడం మాత్రం క్షమించరాని నేరం. బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం కాగా, దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ అఖిలపక్షానికి నాయకత్వం వహించి, ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయించేందుకు కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్లారన్న విషయం మరచి పోకూడదు. వైఎస్‌ నాయకత్వాన ఢిల్లీ వెళ్లిన బృందంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబూ ఉన్నారు.

1969లో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ ఏర్పడిన తర్వాత 1975లో గోదావరి జల వినియోగంపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు శ్రీరాంసాగర్‌ (పోచంపాడు) నిర్మాణం వల్ల మహారాష్ట్రలోని ముంపు ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లించడానికి ఏపీ అంగీకరించింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉండగానే బాబ్లీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2003 వరకు ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నా, బాబు ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. వైఎస్‌ అధికారంలోకి వచ్చాక, పోచంపాడు పరిధిలో బాబ్లీ బరాజ్‌ నిర్మాణం జరుగుతోందని 2005 మేలో తొలిసారిగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగానే కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి లేదని (మహారాష్ట్ర 1975 ఒప్పందాన్ని తిరగదోడదలచినప్పుడు) ఇంజనీర్ల బృందం ధ్రువీక రించింది. బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్రం ఆదేశించింది.



కాగా, ఈ సమస్యపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా మహారాష్ట్ర గైర్హాజరయింది. దీంతో మహారాష్ట్రకు బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం 2006 జనవరి 7న స్పష్టం చేసింది. ఈ కుట్రనంతా బయటపెడుతూ తొలిసారిగా ఇక ‘‘బాబ్లీ కథ ముగిసింది’’ అనే పతాక శీర్షికతో ఓ దినపత్రికలో హెచ్‌. ఈ ప్రత్యేక కథనంలో బాబ్లీ నిర్మాణం రహస్యంగా మహారాష్ట్ర పూర్తి చేసుకున్న వైనాన్ని వివరించడంతోపాటు ఉమ్మడి ఏపీ ప్రజలను, రాజకీయపార్టీలను హెచ్చరించడం జరిగింది. అప్పటికే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ దశలో ఏ ఒక్క ఇతర రాష్ట్రం పిట్టనూ ప్రాజెక్టు వైపునకు రానీయకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈ కథనం రాసిన విలేకరి మహారాష్ట్రలోని తన స్నేహితుని అండదండలతో ప్రాజెక్టు ఫోటోలను కెమెరాలో బంధించి జాగ్రత్తగా బయటపడ్డాడు. నిఘా సంస్థల కళ్లపడకుండా ఇంత సాహసం చేశాడు.

గత నాలుగు దశాబ్దాలుగా సాగిన కుట్ర, కేంద్రం ఆదేశాలను తోసిపుచ్చిన మహారాష్ట్ర బరితెగింపు చర్యల ఫలితం ఇది. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలను ధిక్కరించి బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న వైనంపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి ఉమ్మడి ఏపీ అభ్యంతరాన్ని వైఎస్‌ తెలపడమే గాక, మహారాష్ట్ర సీఎంకూ(2006 ఏప్రిల్‌ 4) నిరసన తెలిపారు. బాబ్లీ నిర్మాణం నిలిపివేయాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళుతూ కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు(2006 ఏప్రిల్‌ 10) చేశారు. గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించి నిర్మిస్తున్న బాబ్లీని నిలిపివేయాలన్న ఏపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు (2006 జులై 7) విచారణ చేపట్టింది. 8 వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. అయినా, మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా 2.70 టీఎంసీల సామర్ధ్యంగల బాబ్లీ నిర్మాణాన్ని పూర్తిచేసింది.



నిజానికి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ఒక్కటే కాదు, గోదావరిపై మరో నాలుగు ప్రాజెక్టులను నిర్మించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోనే బాబ్లీ నిర్మాణం పూర్తి చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల దిగువన ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ, కోస్తా ఆంధ్ర జిల్లాల భూములు బీడు పడిపోతాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా ‘మాకు ఫికరులేదని’ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యులు కొందరు దిలాసాగా ప్రకటించారు. తమ భూభాగంలోకి గోదావరిలోకి నీళ్లు చేరితే తమ లక్ష్యం పూర్తయినట్టేనని చెప్పారు. బాబ్లీతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎడారి కాగలదన్న భీతి ప్రజలలో ఇంకా పోలేదు. సింగూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు, హైదరాబాద్‌ మంచి నీటి సరఫరాకు ఆటంకాలు ఇంకా తొలగలేదు.

వైఎస్‌ తెలంగాణ సౌభాగ్యంలో భాగంగా తలపెట్టిన చేవెళ్ల–ప్రాణహిత, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలకు నీరు అవసరం. ‘జలయజ్ఞాని’కి తలమానికంగా చెప్పుకున్న ఈ ఎత్తిపోతల పథకాలను బాబ్జీ ప్రాజెక్టు కబళించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే బాబ్లీ నిర్మా ణాన్ని ఆపవలసిందిగా మొదట్లో ఆదేశించిన సుప్రీంకోర్టు కూడా చివరికి మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణానికే అనుకూలంగా తీర్పు చెప్పింది. 1969 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో బాబ్లీ కథ మొదలయింది. 2010లో దాని నిర్మాణం ఇంకాస్త రహస్యంగా ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు నాకు ముఖ్యంకాదు అని నమ్మిన వ్యక్తి వై.ఎస్.


No comments

Powered by Blogger.